పెడ్డకాపావరం – నియమం అందరికీ ఒకటే
2025 నవంబర్ 22.
అదే రోజు నేను అయ్యప్ప దీక్ష తీసుకున్నాను.
మాతో పాటు గ్రామంలో 16-17 మంది అయ్యప్ప స్వాములు ఉన్నారు.
అదే రోజు గ్రామంలో ఒక 23 ఏళ్ల యువకుడు ప్రమాదంలో మరణించాడు.
అందరూ సంతాపంలో ఉన్నారు.
స్మశానంలో చివరి కార్యక్రమాలు జరుగుతున్నాయి.
తమర చెరువు – గ్రామ రూల్
మన తమర చెరువు గురించి ఒక గ్రామ నియమం ఉంది:
ఎవరైనా చెరువులో స్నానం చేయొచ్చు,
కానీ స్మశానం నుండి వచ్చే వారు మాత్రం స్నానం చేయకూడదు.
ఇది గ్రామంలో అందరూ పాటిస్తున్న నియమం.
అయప్ప స్వాములు ఉదయం, సాయంత్రం
స్నానం చేసి దేవాలయానికి వెళ్లడం సాధారణమే.
ఎవరూ దాంతో సమస్య పెట్టరు.
ఎవరూ అడ్డుకోరు.
అర్ధరాత్రి జరిగిన అసహనకర విషయం
అదే రోజు రాత్రి మేము స్వాములు చెరువులో స్నానం చేస్తున్నాం.
అప్పుడే 20-30 మంది అకస్మాత్తుగా వచ్చారు.
ఫోన్ లైట్లు వేసి
“నీళ్లలోనుండి బయటకు రండి, దేవాలయానికి వెళ్లండి” అన్నారు.
మేము వాదించలేదు.
దేవుని పేరుతో బయటికొచ్చాం.
కానీ తర్వాత దేవాలయానికి వెళ్లి చెరువు వైపు చూసాము.
అదిగో…
అవే వ్యక్తులు చెరువులో స్నానం చేస్తున్నారు!
ఎందుకు ఇలా చేసారు?
గ్రామ రూల్ అందరికీ ఒకటే కదా?
ఎవరైనా స్మశానం నుండి వస్తే స్నానం చేయకూడదు.
అదే మాట.
అయ్యప్ప స్వాములను వాటర్ నుండి బయటకు రమ్మని చెప్పి
తమ మాత్రం స్నానం చేయడం –
ఇది చాలా బాధాకరం.
ఇది చాలా చెడ్డ పని.
ఎవరికి ఏమి లాభం?
అందరూ పాటిస్తున్నారు.
అటువంటి పెద్ద రూల్ ఉన్నపుడు
కొంతమంది ఇలా చేయడం సరి కాదు.
గ్రామ రూల్ పాటించాలి.
నియమం అందరికీ ఒకటే.
చివరిగా…
ఇది ఎవరో తప్పు చేసారని చెప్పడం కాదు.
గ్రామ గౌరవం, నీటి పవిత్రం, మన సంస్కృతి
వాటిని కాపాడుకోవాలి.
ఎవరినైనా ఇబ్బంది పెట్టడం మన ఉద్దేశ్యం కాదు.
సత్యం చెప్పడం మన ఉద్దేశ్యం.


Leave a Reply